ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0

 

కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం

జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి  17,09,2024:

ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీవీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.
మంగళవారం నాడు, జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ.ఈ నరసింహులు మెప్మా పీడీ ఇందిరా, మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, సంబంధిత లబ్ధిదారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 5 సంవత్సరాల్లో రూ. 10 లక్షల కోట్లతో రూ. కోటి పట్టణ గృహాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో భారతదేశం ముందంజలో ఉందని, పట్టణంలో నివసించే పేదలకు, మధ్య తరగతి ప్రజలకు బాసటగా నిలిచేందుకే ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నర్సాపూర్ తూప్రాన్ మున్సిపల్ కమీషనర్స్
బంధిత లబ్ధిదారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking