ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజా బలం దినపత్రిక మెదక్ నియోజకవర్గం – కౌడిపల్లి
17.09.2024:
కౌడిపల్లి సిహెచ్ లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల్లో అలస్వత్వం వహించిన ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి తాఖీదు
మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కౌడిపల్లి మండలం సిహెచ్సి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిహెచ్సిలో సంబంధిత అధికారులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా శ్రీ కే రమేష్, రాధాకృష్ణ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్, అబ్దుల్ షకీల్ (ఎంపీహెఛ్ ఈ ఓ ) హాజర పట్టికలో సంతకం చేసి విధులకు హాజరు కావడం లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న వారిని రమేష్ రాధాకృష్ణ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ అబ్దుల్ షకీల్ (మల్టీపర్పస్ హెల్త్ ఎడారికేషన్ ఆఫీసర్ (ఎంపీహెఛ్ ఈ ఓ ) వీరి ముగ్గురికి సస్పెండ్ చేశామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లా సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని, ఆకస్మిక పర్యటనలు చేయడం జరుగుతుందని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.