విశ్వకర్మ హస్త కళాకారులు వాస్తు శిల్పు లందరికీ అధిపతి
మెదక్ శాసనసభ్యులు
మైనంపల్లి రోహిత్ రావు
విశ్వకర్మ విశ్వధైనందిక హస్త కళాకారుడు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి 17.09.2024:
విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే
పండుగ అని మెదక్ జిల్లా శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు.
మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి
వేడుకలలో మెదక్ జిల్లా శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్, అడిషనల్ ఎస్పీ మహేందర్, బీసీ సంక్షేమ అధికారి నాగరాజుగౌడ్, సంబంధిత కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
విశ్వకర్మ జయంతి ఉద్దేశించి మెదక్ జిల్లా శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారుచేశాడు. దివ్య వడ్రంగి అని కూడా పిలువబడ్డాడు. అని వివరించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ
హిందూ సంప్రదాయం ప్రకారం, విశ్వకర్మను ప్రపంచంలోని డివైన్ ఇంజనీర్ అని పిలుస్తారు. విశ్వకర్మకు పుట్టినరోజున విశ్వకర్మ జయంతిగా పిలువబడుతోంది. ప్రపంచానికి అసలైన సృష్టికర్తగా పిలువబడుతున్న విశ్వకర్మ, ప్రపంచం కంటే ముందునుండే ఉన్నాడు
అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు