అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన్న మంత్రి కలెక్టర్,

 

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ – కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్ర హానికి పూలమాలలు

….. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి సెప్టెంబర్ 17 ప్రజ బలం ప్రతినిధి:
సంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
ఈ కార్యక్రమంలో జి ఐ ఐ సీ చైర్మన్ టి .నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా ఎస్పీ రూపేష్, లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ, కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్ర హానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, పుర ప్రముఖులకు, అధికార అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు.
త్యాగాల ఫలితమే తెలంగాణ అని, ప్రజా పరిపాలన వైపు అడుగులు వేస్తూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా, రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు స్వతంత్ర సమరయోధులకు జోహార్లు తెలిపారు.


నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెట్టి, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంచెలంచెలుగా లబ్ధిదారులుకు సంక్షేమ ఫలాలు అందిస్తూ విజయవంతంగా ఆరు గ్యారెంటీల పథకాలు ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని చేపట్టి, రైతులకు భరోసా కల్పించామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిస్తున్నామని వివరించారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తూ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాలనయంత్రంగానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking