ఖమ్మం మున్నేరు వరద బాధితులకు స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

 

ప్రముఖ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్. డాక్టర్ గ్రీష్మ

డాక్టర్ గోపీనాధ్, డాక్టర్ గ్రీష్మ లకు కృతజ్ఞతలు

స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ ఓఫీర్

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం ప్రకృతి వైపరీత్యాలతో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయి ప్రజలు కష్ట నష్టాలతో ఉన్నవారి పట్ల తమ మానవీయతను చాటుతూ సేవల్లో ముందంజలో నిలుస్తూ..వారి ఆకలి దప్పులను తీర్చే స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ప్రముఖ గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్, & ప్రముఖ స్త్రీ ప్రసూతి సంతాన వైద్య నిపుణురాలు డాక్టర్ గ్రీష్మ అన్నారుమంగళవారం ఖమ్మంలోని సురక్ష హాస్పటల్ ఆవరణలో 100 మంది మున్నేరు వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహశీల ట్రస్ట్ పేరుతో నిరుపేదలను నిరుపేదలకు ఆపన్న హస్తం అందించే సేవా కార్యక్రమాలు నిర్వహించడం మాటల్లో వర్ణించలేనిదని డాక్టర్ గోపీనాథ్ డాక్టర్ గ్రీష్మ అన్నారు అనంతరం ట్రస్ట్ ఫౌoడర్ & ప్రెసిడెంట్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ మాట్లాడుతూ సామాజిక సేవ కోణంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక లక్షలాదిమంది రోగుల ప్రాణాలను నిలుపుతున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ భీష్మ లు మా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి చేతులు మీదుగా వరద బాధితులకు గ్రాసరీ కిట్స్ పంపిణీ చేయడం హర్షనీయమని అన్నారు ఈకార్యక్రమంలో స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, రంజిత్ ఓఫీర్, జనరల్ సెక్రటరీ అబ్బులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్కోజు యేసు దాసు, జ్యోతిదాస్ , ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ సెక్రటరీ భాను ప్రకాష్, పులి డేవిడ్ రాజు, ఆశా జ్యోతి,సామ్యేల్ పాల్,దీవెన కుమార్, భాగ్యరాజ్, చిన్నా, సుగంధ్ స్థానిక ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking