జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

 

జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు సిబ్బందికి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ ఐ.పి.ఎస్

ప్రజాబలం దినపత్రిక -మెదక్ జిల్లా ప్రతినిధి
17.09.2024:

ఎంతో మంది త్యాగాలతోనే హైదారాబాద్ నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనమైందని,1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం సిద్ధించిందని జిల్లా ఎస్పీ శ్రీ. డి.ఉదయ్ కుమార్ ఐపిఎస్ అన్నారు.తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా ఎస్పీ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…..హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న భారతదేశ యూనియన్ నందు విలీనమైన సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.నేటితో 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు.తెలంగాణకు స్వాతంత్ర్యం సాధించడానికి కృషి చేసిన మహనీయుల సేవలు చిరస్మణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్ మహేందర్ , సైబర్ క్రైమ్ డిఎస్పి శ్రీ సుభాష్ చంద్రబోస్ , సాయుధ దళ డిఎస్పి రంగనాయక, ఎస్బి ఇన్స్పెక్టర్.సందీప్ రెడ్డి , సిసిఎస్ ఇన్స్పెక్టర్ తిరుమలేష్ , డి సి ఆర్ బి సి.ఐ మధుసూదన్ గౌడ్ గారు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking