BLV దరఖాస్తుకు గడువు పొడిగింపు చివరి తేదీ 30.03.2024

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 26 : తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ మరియు ట్రైబల్ సంక్షేమ గురుకులాల సంస్థ విద్యాలయాల్లో 2024-25 విద్యాసం వత్సరమునకు గాను 6,7,8, మరియు 9 వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు (బ్యాక్ లాగ్ వేకేన్సీలు) భర్తీ చేయుట కొరకు అర్హత గల విద్యార్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరడమైనది.TSWR సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ (COE), అలుగునూర్ (కరీంనగర్ జిల్లా) మరియు గౌలిదొడ్డి (రంగారెడ్డి జిల్లా) లోని పాఠశాలల్లో 9 వ తరగతిలోకి మాత్రమే రెగ్యులర్ అడ్మిషన్స్ కోరడమైనది.అలాగే TTWRS యొక్క స్కూల్ అఫ్ ఎక్స్టెన్స్ పరిగి (బాలికలు),వికారాబాద్ జిల్లా మరియు ఖమ్మం (బాలురు),ఖమ్మం జిల్లా లో 8 వ తరగతి లో మాత్రమే రెగ్యులర్ ప్రవేశం కొరకు కూడా దరఖాస్తులు కోరబడుతున్నవి.ఖాళీల వివరముల,ఆన్ లైన్ దరఖాస్తు కొరకు www.tswreis.ac.in వెబ్ సైట్ ను సందర్శించి, తేది: 30.03.2024 లోపు అప్లై చేసుకోగలరు.ప్రవేశ పరీక్ష తేది: 21.04.2024 రోజున ఉ.11.00 గం.నుండి మ.1.00 గం. వరకు నిర్వహించబడును. ప్రిన్సిపాల ఎం లలిత కుమారి,సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9704550167 తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking