మెదక్ మండలం నవాబ్ పేటకు చెందిన మొకిరే మహేష్ తండ్రి విఠల్ (32) అను అతను అతని భార్య మొక్కిరే జ్ఞానేశ్వరి గత సంవత్సర కాలము నుండి సంసారానికి రాక పుట్టింటి వారి దగ్గర కూలి పని చేసుకుంటూ మెదక్ మండలం నాగపూర్ గ్రామంలో ఉంటుంది. భార్య రాకపోవడం వలన జీవితంపై విరక్తి చెంది తీవ్ర మనస్థాపానికి గురై గుర్తు తెలియని రైలు రాకను గమనించి రామాయంపేట మండలం అక్కన్నపేట నుండి బిక్కనూర్ మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.మృతుని భార్య జ్ఞానేశ్వరి మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం క్రైమ్ నెంబర్ 75/24.174 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్ స్థానిక విలేకర్లకు తెలిపారు.
