న్యాయవాదులు ఎన్నికల సందడి

కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గం 2024 మార్చ్ చివరి వారం తో ఏడాది కాలం ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడే న్యాయవాదుల ఎన్నికలసందడి మొదలైనది. ఇంక ఎన్నికల అధికారి నియామకం, షెడ్యూల్ విడుదల చేయకముందే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హడావిడి, ప్రచారం ఊపదుకుంది. కరీంనగర్ బార్ అసోసియేషన్ లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోస్టులు ఎంతో కీలకమైనవి/ఖర్చు తో కూడినవిగా ముద్ర పడినాయి. ప్రతి సంత్సరం పోటీచేసే అభ్యర్థుల ఖర్చు పెరిగిపోతోదని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. ఏ కార్యవర్గం వచ్చిన న్యాయవాదులకు కనీస సౌకర్యాలు పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్ లో టాయిలెట్స్, దాదాపు 200 ల వరకు ఉన్న మహిళ న్యాయవాదులకు కనీసం టాయిలెట్స్ లేకపోవడం ఎంతో విచారించదగ్గ విషయం. క్యాంటీన్ లో అగ్రిమెంట్ ప్రకారం కాకుండ ఇష్టానుసారం రెట్లు పెంచి, వసూలు చేస్తూ దారుణం తయారైంది . జిరాక్స్ సెంటర్ కూడా ఇదే పరిస్థితి ఉన్నది. పోటీచేసే అభ్యర్థులు ఇంత వరకు ఏం చేశారు , ఏం చెయ్యబతున్నదో స్పష్టం గా తెలుపాలని పలువురు న్యాయవాదులు అభిప్రాయ పడుతున్నారు. రెగులర్ గా వచ్చే న్యాయ వాదుల పలు సమస్యలు, నాన్ ప్రాక్టీసింగ్ న్యాయ వాదులకు తెలియక పోవడం, వాళ్ళే ఇక్కడ గెలుపు,ఓటములు డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు. న్యాయ వాదులకు ఇండ్ల స్థలాలు గురించి వసూలు చేసిన డబ్బులు/సొసైటీ ఎన్నికలని ఆశాలు ఆశాలగానే ఉన్నవి. డిజిటల్ లైబ్రరీ పరిస్థితి అలాగే ఉంది. ఈసారైనా కొత్త పాలకవర్గంపై న్యాయవాదులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking