వరంగల్ రేంజ్ నూతన ఐజి గా ఏవి రంగనాథ్.

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 26:

వరంగల్ రేంజి నూతన ఐజి గా ఆవుల వెంకట రంగనాథ్ ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన రంగనాథ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2023 లో జరిగిన ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ చేపట్టిన బదిలీలలో భాగంగా హైదరాబాద్ కు బదిలీపై వెళ్లారు. అయితే మూడు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. స్టేట్ సర్వీస్ నుంచి ఐపీఎస్ లు గ గుర్తింపు పొందిన ఐదుగురికి వారి సర్వీసులను అనుసరించి పదోన్నతులను కల్పించింది. సి ఎస్ శాంత కుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో ఐజిగా పదోన్నతి పొందుతూ ఉత్తర్వులు అందుకున్నా వారిలో ఏ వి రంగనాథ్ ఒకరు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పదోన్నతి కల్పించడంతోపాటు బాధ్యతల నిర్వహణ కోసం వరంగల్ రేంజ్ ఐజీ గ కేటాయించింది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఐజిగా త్వరలో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking