వ్యవసాయ భూములను ధ్వంసం చేయొద్దు
NHiA అధికారులకు బాధితుల వినతి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 : పాత అలైన్ మెంట్ ప్రకారమే ఫోర్ వే నిర్మించాలని, వ్యవసాయ భూములను ధ్వంసం చేసి రోడ్డు నిర్మించొద్దొని,దానిద్వారా రైతులు నష్టపోతారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం మంచిర్యాలలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ రైతులు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…నెంబర్ 666, జాతీయ రహదారులు,రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ నెల 14న జారీ చేసిన ప్రకటన వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు.గతంలో నాలుగు వరసల రహదారి గ్రీన్ ఫీల్డ్ మొట్టమొదటిగా గూడెం నుండి వయా కరీంనగర్ చౌరస్తా గంపలపల్లి మీదుగా వెల్లునట్లుగా ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేశారని,ఆ తర్వాత ఎన్ హెచ్ 63 ఒకసారి వెంబడి వెళ్లినట్లుగా గెజిట్ నోటిఫికేషన్ గతంలో విడుదలైనదన్నారు.పలుమార్లు విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఏ కారణంల చేత రద్దు చేయబడినదో తెలపాలన్నారు.కొంతమంది బడా వ్యాపారుల కోసమే అలైన్ మెంట్ మార్చారని వారి ఆరోపించారు.ఈ కార్యక్రమంలో గోప అశోక్,పడాల కాంతయ్య,పోడెట్టి శ్రీనివాస్,పాదం శ్రీనివాస్ సూరం చంద్రమౌళి, కొట్టే మహేష్,కూకట్ల తిరుపతి,గొడుగు కుమార్,ఎంబడి రాజు,మినుముల శాంతి కుమార్,మాదాసు శ్రీనివాస్, నారపరెడ్డి,పెట్టెం శ్రీనివాస్ లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు