హన్మకొండకు తరలిస్తున్న మేడారం హుండీలు
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 26
మేడారం సమక్మ-సారలమ్మ మహా జారత దిగ్విజయంగా ముగిసింది. ఐదు రోజులపాటు జన జాతరను తలపించిన వన మేడారంలో వన దేవతలకు భక్తులు చెల్లించిన మొక్కుల లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
దీంతో అధికారులు సోమవారం మేడారం నుంచి హుండీలను హన్మకొండకు తరలించి కానుకల లెక్కింపులో
నిమగ్నమై ఉన్నారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈనెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు.
మేడారం జారతలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. పది రోజుల పాటు హుండీల లెక్కింపు నిర్విరామంగా కొనసాగనుంది.