వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 26
సోమవారం ఏనుమాముల మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోడౌన్ లో
ఈ సి ఐ ఎల్ నుండి అదనంగా స్వీకరించిన 50 ఈవీఎంలకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈసిఐ ఎల్ ఇంజనీర్లచే మొదటి దశ చెకింగ్ (FLC) నిర్వహించరూ.
రానున్న లోకసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందికి ఈవీఎంలపై శిక్షణ నిమిత్తం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయానికి, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు 10 ఈవీఎంల చొప్పున 40 ఈవీఎంలను కేటాయించరూ.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకులు విశ్వ నారాయణ, ఉప తహసీల్దార్ రంజిత్, కాంగ్రెస్, బీఎస్పీ, వైయస్సార్సీపి, టిడిపి, ఎంఐఎం,రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజేష్, సాగర్, రజినీకాంత్ లక్ష్మణ్, ఫైజుద్దీన్, ఈసీఐఎల్ ఇంజనీర్స్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.