న్యాయ వాదుల బాల్ బ్యాట్మెంటన్ స్పోర్ట్ సెక్రటరీ టీమ్ విజయం

కరీంనగర్‌ ప్రజాబలం ప్రతినిధి: రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని న్యాయవాదుల బాల్ బ్యాట్మెంటాన్ పోటీలను కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారము జిల్లా కోర్టు ఆవరణలోని బాల్ బ్యాట్మెంటన్ పోటీలను ప్రారంభించగా ఏడు టీమ్ లుగా ఏర్పడి పోటీలు జరుగగా ఫైనల్ లో డిజె 11 పై స్పోట్స్ సెక్రెటరీ టీమ్ విజయం సాధించింది. స్పోర్ట్ సెక్రటరీ టీమ్ లో మంద రవీందర్, కొట్టే తిరుపతి, గోనేపల్లి శ్రీనివాస్ , జ్ఞానేశ్వర్, పెంచాల విశాల్, రామాంజనేయులు, నోనూ రాజ్, పేరుక రంగయ్య, ఎం శ్రీధర్ , శేఖర్ ల జట్టు విజయం సాధించింది. డిజే 11 టీమ్ లో సయ్యద్ మోబిన్, జిత్తు సృజాన్ , గొంటి మధు, ఎస్ వేణు, ఆర్ ఈశ్వర్, కొత్త ప్రకాశ్, గుజ్జ సతీష్, ఆర్ దేవేందర్, జూలూరి శ్రీరాములు, గౌతం రాజు లు రన్నర్స్ గా నిలిచారు. కార్యక్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు పీవి రాజ్ కుమార్, బెతి మహేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. బాల్ బ్యాట్మెంటన్ ఇన్చార్జి గా గుడిపాటి సత్యం రెడ్డి వ్యవహరించారు. విజేతలను రిపబ్లిక్ డే రోజున జిల్లా జడ్జి బి ప్రతిమ బహుమతులను అందజేస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking