న్యాయవాదులపై దాడులు అరికట్టాలి
బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ కుమార్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 19 : న్యాయవాదులపై దాడులను అరికట్టాలని లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్ పేర్కొన్నారు.సోమవారం హైదరాబాద్ కుకట్పల్లి బార్ అసోసియేషన్ కు చెందిన సంతోష్ అనే న్యాయవాది అక్రమ అరెస్టు,దాడికి నిరసనగా లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో న్యాయ వాదులు రాజేశ్వర్ రావు, కొమిరెడ్డి సతన్న, భూమారెడ్డి,శ్రీధర్, నలినికాంత్,తిరుపతి స్వామి,ప్రదీప్,శివశంకర్, మల్లికార్జున్,తాజోద్దీన్,ఆనంద్,రాజ్ కుమార్ పాల్గొన్నారు.