రాఖీ పండుగ రోజు తప్పిన భారీ ప్రమాదం
ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి / రామయంపేట్
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఎప్పుడు ప్రజలతో రద్దీగా ఉండే రామాయంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద AP39VC 2718 నెంబర్ గల లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. లారీ ఢీ కొట్టిన సమయంలో అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం రద్దీగా ఉన్నప్పటికీ ఎవ్వరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేడే రాఖీ పండుగ కావడం ప్రజలంతా రోడ్లపై ఉండడం లారీ డివైడర్ను ఢీకొట్టడంతో ప్రజలంతా చూస్తూ ఆశ్చర్యపోయారు. కొంత సమయం వరకు ప్రజలు వాహనదారులు సమస్యలు ఏర్పడ్డాయి. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేసి లారీని స్టేషన్కు తరలించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది