ఘనంగా ప్రపంచ పోటౌగ్రఫ్లీ దినోత్సవ వేడుకలు

మధురమైన జ్ఞాపకాలను భద్రపరిచేదే ఫోటో

ఫోటో,వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పు శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 19 : మధురమైన జ్ఞాపకాలు భద్రపరిచేదే ఫోటొగ్రఫీ అని ఫోటో, వీడియో అసోసియేషన్ అధ్యక్షులు బొప్పు శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ప్రపంచ 185 వ ఫోటోగ్రఫీ దినోత్సవన్ని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేది ఫోటోగ్రఫీ అని, ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి, ఉపాధ్యక్షుడు వినిత్, మల్లేష్,ఫోటోగ్రాఫర్స్ కూడెల్లి వరుణ్, భాను చందర్,మధుచారి, తిరుపతి,బాషా, శ్రీనివాస్,కమల్, మధు,సతీష్,కిరణ్, నేతవత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking