ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి/ చిన్న శంకరంపేట
19 ఆగస్టు 2024 :
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న శంకరంపేట మండలo మల్లుపల్లి గ్రామానికి చెందిన ధ్యానబోయిన యాదమ్మ,సాయిలు,ఇల్లు
సోమవారం కూలిపోయింది. ఈ సందర్భంగా యాదమ్మ సాయిలు మాట్లాడుతూ ఇంట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, వంట సామాగ్రి బియ్యము, బట్టలు పూర్తిగా తడిసిపోయాయని, సుమారు లక్ష రూపాయల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఇప్పటికింకా వర్షాలు తగ్గకపోవడంతో ఎక్కడ నివాసం ఉండాలో తోచడం లేదని ప్రభుత్వం పాలన అధికారులు వెంటనే ఆదుకోవాలని వారు కోరారు