ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి/ నిజాంపేట్
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి కోతుల బెడద ఎక్కువైంది. స్కూల్ పిల్లలు కూడా రోడ్డుపై నుంచి వెళ్లడానికి భయపడిపోతున్నారు, ఎప్పుడు ఎవరి పైన పడి దాడి చేస్తాయో అని ప్రజలు భయపడిపోతున్నారు
దాదాపు 100 నుండి 200 కోతులు గ్రామంలో ఇష్టానుసారంగా సంచరిస్తున్నాయి. ప్రజలు ఉదయం పూట నిత్యం చేసే పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఇంట్లోని వస్తువులను బయట పారేయడం ఇంట్లో వస్తువులను చిందరవందరగా చేయడం చిన్నపిల్లలను భయపెట్టడం కొరకడం వంటివి చేస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు