ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి / భూంపల్లి
ఉమ్మడి మెదక్ జిల్లాలో గల భూంపల్లి మండలం చిట్టాపూర్ వద్ద765 డిజి హైవే రోడ్డు నిర్మాణ పనుల్లో కల్వర్టు కట్టడానికి తీసిన గోతిలో ఒకరు ద్విచక్ర వాహనంపై నుంచి అందులో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం అతడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీ గాదకు చెందిన బందెల రాజు వయసు 40 డ్రైవర్ పని చేసుకుంటూ సిద్దిపేటలో ఉంటున్నాడని గుర్తించారు శనివారం బైక్ పై స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడని నిన్న అతన్ని గుర్తించి బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించామని తెలిపారు. దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది
