లక్షెట్టిపేట న్యాయ వాదుల నిరసన

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 21 : రంగారెడ్డి కోర్ట్ న్యాయవాదైన బి.సత్యనారాయణ పై ఘట్కేసర్ పోలీస్ లు పాశవిక దాడికి నిరసనగా లక్షెట్టిపేటబార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి,సంఘీభావం తెలియజేస్తూ కోర్ట్ విధులను బహిష్కరించారు.మంగళవారం న్యాయవాదుల పై పోలీసుల అన్యాయపూరిత దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారని అన్నారు.ఈ సందర్భంగా న్యాయవాది కారుకురి సురేందర్ మాట్లాడుతూ…. రంగారెడ్డి కోర్టు పరిధిలోని ఘట్కేసర్ పోలీసు అధికారి బి సత్యనారాయణ న్యాయవాదిపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.న్యాయవాదులు అంటే కోర్టు అధికారులని పోలీసులకు తెలవకుండా పోతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎస్. ప్రదీప్ కుమార్,ఏ.జి.పి.పద్మ, న్యాయవాదులు ఈ.రాజేశ్వరరావు, కే.భూమారెడ్డి,అక్కల.శ్రీధర్,
నరేందుల.సురేందర్,కొమిరెడ్డి.సత్యన్న,నగురు రవీందర్,చుంచు. తిరుపతి స్వామి,నాయిని. సత్యగౌడ్,సిహెచ్చ్. సుమన్ చక్రవర్తి.తాజోద్దీన్,సిహేచ్చ్. శివశంకర్, సిహేచ్చ్.మల్లికార్జున్, ఎస్.రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking