మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 21 : లక్షెట్టిపేట మున్సిపాలిటీలో హత్ సే హాత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి లోని
5,11 వార్డు లో ప్రతి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అన్నారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. బడుగు,బలహీనీ అభివృద్ధికి పాటుపడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు.ఈ కార్యక్రమoలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్,మైనార్టీ అధ్యక్షులు నవాబ్,ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ గుత్తికొండ శ్రీధర్,పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాతరాజు రాజేష్,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,సూర్య చంద్రమౌళి, కోల నాగర్జు,విల్సన్,రాజు,రవి, మురళి,హజి,కోసుగంటి ప్రశాంత్,తార చెంద్,చిన్న వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.