ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 05: మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర కళాశాలలో నిర్వహించినటువంటి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం.లలిత కుమారి ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.ఎంపికైన విద్యార్థినులు ఈ నెల 7, 8 ,9 తేదీలలో హనుమకొండలోని జే ఎన్ ఎస్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పీడి పీఈటి మల్లికా మమత తెలిపారు. గెలుపొందిన విద్యార్థులు వివరాలు, ఎం.రశ్మిత 1500 మీటర్స్, ఎం మనోహరికా 100 మీటర్స్ సి.హెచ్.సహస్ర షార్ట్ పుట్డి.దీపిక హై జంప్
జె సంజన 400 మీటర్స్
బి స్వర్ణ విజేత 800 మీటర్స్ కె కుంకుమ 3 కిలో మీటర్ల రన్ లో పాల్గొంటారు.వీరిని కళాశాల ప్రిన్సిపల్ ఎం లలిత కుమారి,వైస్ ప్రిన్సిపాల్ కె మహేశ్వర రావు,అండర్/19 ఎస్ జి ఎఫ్ సెక్రటరీ బాబురావు,కళాశాల ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.