ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య మాట్లాడుతూ… మున్సిపల్ బడ్జెట్ సమావేశం నందు 2022-23 ఆర్ధిక సంవత్సరపు సవరణ బడ్జెట్ రూ. 10 కోట్ల 90 లక్షల 35 వేల రూపాయలతో అంచనాలతో 2023-24 ఆర్ధిక సంవత్సరపు వార్షిక అంచనా బడ్జెట్ కు సంబంధించిన బడ్జెట్ ను కౌన్సిల్, కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవముగా ఆమోదించారని తెలిపారు.ఈ బడ్జెట్ ససమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు,జిల్లా కలెక్టర్ భానవత్ సంతోష్,అదనపు కలెక్టర్ రాహుల్,ఆకుల వెంకటేష్,వైస్ చైర్మన్ పోడేటీ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు,మునిసిపల్ మేనేజర్ , అసిస్టెంట్ ఇంజనీర్ మునిసిపల్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.