అగ్రహారంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని , సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మెదక్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్

 

మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్ :-

గౌరవ మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ మెదక్ జిల్లా మనోహర బాద్ మండలం లోని ఆగ్రారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరియు జెడ్పి నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నీ వార్డులలో ఇంకేమైన సమస్యలు ఉన్నయ అని ప్రజలని అడిగి తెలుసుకున్నారు మరియు కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని పట్టగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ గారినీ కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి , ఎంపిడిఓ యాదగిరి రెడ్డి , వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి , పార్టీ అధ్యక్షులు పురం మహేష్ , సర్పంచ్ రేణుక ఆంజనేయులు , ఉప సర్పంచ్ లు ఆంజనేయులు రాజు యాదవ్ , వెంకటేశం , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking