సంత్సేవాలాల్ ఆలయాన్ని దర్శించుకొన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
అంగన్వాడీ పాఠశాల చిన్నారులతో ముచ్చటించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై
గవర్నర్కు స్వాగతం పలికిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 3:మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ మండల పరిధిలో గల రాజబొల్లారం తండాలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రధాని మంత్రి భారతీయ జన ఔషది పరియోజన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఘనంగా స్వాగతం పలికారు. రాజబొల్లారం తండాకు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం అంగన్వాడీ పాఠశాలను సందర్శించి పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించిన గవర్నర్ తమిళిసై. తండాలో గిరిజనులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. అనంతరం రాజబొల్లారం తండాలో నిర్మించిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీసంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని సందర్శించుకొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి భారతీయ జన ఔషది పరియోజన మెడికల్ క్యాంపును సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఐఆర్సీఎస్ జిల్లా ఛైర్మన్ రాజేశ్వరరావు, జడ్పీ సీఈవో దేవసహాయం, డీపీవో రమణమూర్తి, సర్పంచ్ మంగ్యా నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు తండావాసులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.