ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న దండేపల్లి రైతులకు,కాంగ్రెస్ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 :మంచిర్యాల జిల్లా ప్రభుత్వం ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న దండేపల్లి రైతులకు,కాంగ్రెస్ నేతలకు శుక్రవారం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఈ సందర్భంగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 వేల ఎకరాలకు సాగు నిరాందించాలని స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఒప్పించి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గూడెం ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చారు,నీళ్లకోసమే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నాసిరకం పనులు చేయడం వల్లనే మోటర్లు రిపేర్ కు వచ్చి రైతులకు సాగునీరు అందడం లేదు,ఎత్తిపోతల ద్వారా 3 టీఎంసీల నీళ్లను రెండు మోటార్ల ద్వారా పంపింగ్ చేసి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా మోటార్ల పంపింగ్ సామర్థ్యం తగ్గట్టుగా పైప్ లైన్ వేయలేదు,పైప్ లైన్ పనులు నాసిరకంగా ఉండటం వల్ల పగిలిపోతున్నాయి,మోటర్లు కూడా ఖర్చు రిపేర్ కావడంతో కెనాల్ ద్వారా సాగునీరు రైతులకు అందడం లేదు,కెనాల్ 30, 42 కాలువ ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నిరందించలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను,
అమరణ నిరాహార దీక్షకు దిగిన 13 మంది రైతుల ప్రాణానికి ముప్పు ఉన్న నేపధ్యంలో వారికి బరోసా కల్పించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశాము,నీళ్ల కోసమే తెలంగాణ తెచ్చుకుంది.తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల కోసం రైతుల గోసపడటం ప్రభుత్వ వైఫల్యం
సాగునీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు,ప్రభుత్వం పై పోరాటం చేద్దాంశకాంగ్రెస్ పార్టీ రైతులకు వెన్నటి ఉంటుంది,

వారి కష్టాలకు అండగా ఉంటాం,2023- 24 కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది,రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం,గూడెం ప్రాజెక్టుకు కొత్త మోటర్లు,కొత్త పైప్ లైన్ వేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం,యాసంగి సాగుకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడతాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఎంపీటీసీలు కొంగల నవీన్,తోట మోహన్ నాయకులు కంది సతీష్, ఆకుల దుర్గ ప్రసాద్,కోట్నాక తిరుపతి,చిట్ల రమణ,బత్తుల రమేష్,దుమ్మని సత్యం,బొమ్మన మల్లేష్,కనక జంగు,చుంచు నగేష్, బల్లికొండ మల్లేష్ లు,ఆమరణ నిరాహార దీక్ష చెప్పాటి వారిలో వుంన్నరు,ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అద్యక్షులు తూముల నరేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్యా,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు,కౌన్సిలర్ రామగిరి బాణేష్, యువజన కాంగ్రెస్ నియోజక వర్గ అద్యక్షులు సల్ల మహేష్, ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు వడ్డే రాజమౌళి,గాండ్ల సత్తమ్మ,పుట్ట లావణ్య,లలిత, డిసిసి డెలిగేట్ ఆది సంజీవ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్,ఎంపీటీసీ లు బాలరాజు,డేగ బాపు,తూముల వెంకటేష్,పుదరి ప్రభాకర్,బోల్లం భీమయ్య,పెంట రమేష్,చింతకింది మల్లయ్య,గట్టు స్వామి,భీమాగౌడ్, సంతోష్,శంకర్,రాజన్న,వెంకటేష్, అజయ్,ప్రకాష్,రఫీ,రమేష్, తిరుపతి,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking