వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 3:
మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంపునకు నిరసనగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.మహిళలు,ప్రజలు పెద్దఎత్తున పాల్గొని రోడ్డుపైన వంట చేసి కాళీ సిలిండర్లతో నిరసనను వెలిబుచ్చారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యుల నడ్డివిరిచే విదంగా కేంద్రలోని మోడీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అన్నారు.
తాజాగా మరోసారి గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారంమోపిన మోడీ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు మోడీ సర్కారు ఇచ్చే కానుక ఇదేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
గ్యాస్ బండను సమాన్యులపై గుదిబండగా మార్చారని ఇప్పటికే పెంచిన నిత్యావసర సరుకులు,పెట్రోల్ ,డీజిల్ ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మరోమారు సిలిండర్ ధర పెంచి ప్రజల పై అధిక భారం మోపుతున్నారని మోడీ సర్కారు ప్రజాగ్రహానికి బలికాక తప్పదని ఎమ్మెల్యే హేచ్చరించారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చెందిందని ప్రజలను ఆర్థికంగా ఎదిగే విదంగా ప్రణాళికలతో ముందుకుపోతుంటే గ్యాస్,నిత్యావసర సరుకుల ధరలు పెంచి అధికభారం మోపి ప్రజలను గోస పెడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన గ్యాస్ ధరలు తగ్గించి మహిళాలోకానికి,ప్రజలకు మోడీ సర్కారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, గందె కల్పన నవీన్, చింతాకుల అనిల్ కుమార్, భోగి స్వర్ణలత సురేష్, కావేటి కవిత, అరుణ, సురేష్ జోషి, మాజీ కార్పొరేటర్లు,మహిళానాయకురాళ్లు,టెంపుల్ డైరెక్టర్లు,డివిజన్ల అధ్యక్షులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.