ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ప్రతిపక్షాలు – వచ్చే పార్లమెంటు సమావేశాలు బహిష్కరించాలి
రాజ్య సభ సబ్యులు జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య
సంగారెడ్డి మార్చ్ 3 ();జనగణనలో కులగణన చేయడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశంలో ఐకమత్యంతో ఒక్కటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అలాగే రైల్వే, ఎల్.ఐ.సి, బి.హెచ్.ఈ.ఎల్, బి.డి.ఎల్, బ్యాంకింగ్, రక్షణ సంస్థలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదని రాజ్య సభ సబ్యులు జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్యఅన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసారు.అందుకు పార్లమెంటులో ఏకమై కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలని కోరారు.నేడు సంగా రెడ్డి జిల్లా సదాశివ పేట లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు. పై రెండు ప్రధాన డిమాండ్ల సాధనకై పార్లమెంటులో ఉన్న 34 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వచ్చే నెల ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటులో విస్తృతంగా చర్చించాలని, ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంటు సమావేశాలు బహిష్కరించాలని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా జనగణన చేపట్టబోతుంది. జన గణ పట్టికలో 34 కాలమ్స్ పెట్టడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించడం దుర్మార్గం. ఒక్క రూపాయి అదనపు ఖర్చు లేకుండా దేశంలోని కులాల వివరాలన్నీ వస్తాయి. ఎందుకు BJP ప్రభుత్వం అంగీకరించడం లేదు. దేశంలోని 70 కోట్ల మంది బి.సి లకు అభివృద్ధి చేయకుండా భారతదేశం అగ్రదేశంగా తయారవుతుందా? ఎందుకింత బి.సి ల పట్ల కక్షా! వివక్షా ! బి.సి ల పట్ల కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.కుల గణన ప్రజలకు కాదు – కేంద్ర –రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాల కోసం అవసరం. కుల గణనతో ఒక్కొక్క కులం జనాభా హో పాటు సాంఘీక, ఆర్ధిక, రాజకీయ వివరాలు సేకరించి వారి కులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు లబిస్తాయి. జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయించి వారి ఆర్ధికాభివృద్ధి కి చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది, బి.సి కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి గ్రూపులుగా వర్గీకరించడానికి వీలవుతుందన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (D-6) ప్రకారం పంచాయత్ సంస్థలలో ఆర్టికల్ 243-T.6 ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. వీటిని అమలు చేయాలంటే ఏగ్రామంలో – ఏ వార్డులో – ఏ మండలంలో – ఏ జిల్లాలో – ఏ మున్సిపాలిటీలో – ఏ మున్సిపల్ కార్పొరేషన్ లో, ఏయే గ్రామాలు, వార్డులు, డివిజన్లలో బీసీ జనాభా ఎక్కువ ఉంటే ఆస్థానాలు బీసీలకు కేటాయిస్తారు. చట్టబద్ధమైన కుల గణన వివరాలు లేక తాత్కాలికంగా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి, లేదా లాటరీ పద్ధతిలో బీసీ స్థానాలు కేటాయిస్తున్నారు. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలని విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక న్యాయపరమైన చట్టపరమైన కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని మూలంగా ప్రజలు కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నారు. ఒక్కసారి కులగణన జరిగితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది కదా! మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం రెండు సిఫార్సులు మాత్రమే అమలుచేశారు. మిగతా 38 సిఫార్సులు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.7854 రాజ్యాంగబద్ధమైన కమిషన్ సిఫార్సులకు విలువలేదా? అమలు చేయరా? ఈ పేదకులాలు అభివృద్ధి చెందకూడదా? బి.సి. కులాలను కులకోణంలో చూసి ఈర్ష్య, ద్వేషాలతో అణచివేస్తున్నారు. ఈ కులాల అభివృద్ధికి 74 సంవత్సరాల క్రితమే అనేక పథకాలు, స్కీములు పెట్టాలి. కాని పెట్టలేదు. ఇలా పెట్టకపోవడం వలన ఈ కులాల అభివృద్ధి ఆగిపోయింది. “ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంది. దేశ సంపద వృద్ధి చెందుతుంది. ఇందులో పేదకులాలకు వాటా రావాలి కదా! కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను అధికాంలోకి తేవడానికి బి.సి.లు ఓట్లు వేయాలి. అలాగే ప్రపంచదేశాల నుండి తెచ్చే అప్పులకు బి.సి.లను బాధ్యలను చేయాలి. కాని ఈ దేశ సంపదలో అధికారంలో వాటా ఇవ్వరా? ఇదేమి ఆటవిక న్యాయం? ఇన్ని సంవత్సరాలు ఈ బి.సి. కులాలకు అన్యాయం చేశారు. ఇంకా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దేశంలోని 70 కోట్ల మంది బి.సి. కులాలను అభివృద్ధి చేయకపోతే ఈ దేశం అగ్రదేశంగా ఎలా రూపుదిద్దుకుంటుంది. ఈ భారతదేశం అగ్రదేశంగా రూపుదిద్దుకోవద్దా అని ప్రశ్నించారు. బి.సి.కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవలసిన చారిత్రిక సమయం ఆసన్నమైంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో బి.సి. కులాలకు అన్ని రంగాలలో వాటా ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇంకా ఈ కులాలను మోసం చేసి, వంచించే ఆలోచనలను విరమించుకోవలసిన సమయం ఆసన్నమైంది. ప్రపంచదేశాలలో అణచివేతకు గురైన కులాలు పాలకులకు ఎదురుతిరుగుతున్నాయి. వాటిని చూసైన నేర్చుకోరా!70 కోట్ల మంది జనాభాగల బి.సి.ల అభివృద్ధికి ఇంతవరకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖలేదు. బడ్జెటు కేటాయింపులు లేవు. కనీసం ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం. కోర్సులు చదివే వారికి స్కాలర్షిప్లు, ఫీజులు రియంబర్స్మెంటు స్కీములేదు. కేంద్ర స్థాయిలో బి.సి.ల అభివృద్ధికి ఎలాంటి స్కీములు లేవు. తమరు జోక్యం చేసుకొని కేంద్రప్రభుత్వంపై వత్తిడి తీసుకరావలసిన సమయం ఆసన్నమైనది. ఈ క్రింది డిమాండ్లను బి.సి.లకు కల్పించడానికి, అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
డిమాండ్లు :
1) పార్లమెంట్ లో బి.సి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బి.సి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.
2) జనగణనలో కులగణన చేయాలి.
3) బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి.ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.
4) పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 50 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.
5) బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలి.
6) కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలి.
7) బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలి.
8) ఎస్సీ/ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి యాక్టును తీసుకరావాలి.
9) ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్ధిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి.
10) సుప్రీమ్ కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ఎస్టీ.బి.సి లకు రిజర్వేషన్లు పెట్టాలి.
11) కేంద్రంలో బి.సి లకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ మరియు ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి.
12) కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి.
13) కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ తో బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
14) జాతీయ బి.సి ఫైనాన్స్ కార్పోరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బి.సి కార్పొరేషన్ బడ్జెట్ ఏటా 50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడి తో రుణాలు మంజూరు చేయాలి.
15) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బి.సి/ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలుచేయడం లేదు. మెరిట్ లో వచ్చిన వారిని ఓపెన్ కంపిటీషన్ లో భర్తీ చేయాలి. కులాలు/వర్గాల ప్రమేయం లేకుండా రహస్య పద్ధతిలో ఇంటర్వ్యూలు జరుపాలి. ఈ సమావేశం లోబిరయ్య, బిసి ఐక్యవేదిక ప్రెసిడెంట్ అనంతయ్య, బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి. వెంకట్ యాదవ్ బలరాం, తదితరులు పాల్గొన్నారు.
Prev Post