హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రములోని 28 కులాల మిత్రులు కలిసి మన కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చడానికి
మన కులాలను విచారణ జరిపిన జాతీయ బిసి కమిషన్ కేంద్ర సాధికార మంత్రిత్వ శాఖకు విచారణ జరిపిన కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చవచ్చు అని నివేదిక అందజేయడం జరిగింది. అట్టి విషయంలో తొందరగా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకొని
జాతీయ బిసి కమిషన్ పంపిన నివేదిక ద్వారా మన కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో త్వరగా చేర్చు ప్రయత్నం కోసం ఈటెల రాజేందర్
ఎంపి ని మర్యాదపూర్వకంగా కలడానికి
శుక్రవారం ఉదయం 10 గంటలకు సామీర్ పేట్ కార్యాలయమునకు వెళ్లడం జరిగింది. ఇక్కడకు వచ్చిన
వివిధ కులాల ముఖ్య నాయకుల కుల సంఘాల రాష్ట్ర లెటర్ ప్యాడ్ ల పైన రాసి ఇచ్చిన వినతి పత్రాలు అన్ని కలిపి ఒక వినతి పత్రంగా రాసి ఎంపి ఈటెల రాజేందర్ కి నేడు
ఈశ్వర్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.
ఈ సందర్బంగా గౌరవ ఎంపి మాట్లాడుతూ… తప్పకుండ ఈ సమస్యను త్వరలో కేంద్ర మంత్రివర్గం ద్రుష్టికి తీసుకవెళ్లి అందరి కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఈశ్వర్ , పిల్లి సంజయ్ కుమార్, మోహన్ చౌహాన్,బోరెద ప్రవీణ్ కుమార్,జాజెరావు వేదకర్, రాంనివాస్ వర్మ శ్రీనివాస్ తిపిరిశెట్టి, మరియు వివిధ కుల సంఘాల నాయకులు పాలుగోన్నారు.