శేర్‌లింగంపల్లి ప్రజాబలం ప్రతినిధి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం విద్యా కమిటీ సభ్యులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా రాయదుర్గం విద్యా కమిటి సభ్యులు మాట్లాడుతూ రాయదుర్గం లోని ప్రభుత్వ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వ డిగ్రీ కళశాల ఏర్పాటు చేయాలని వినతిపత్రం ద్వారా తెలియచేయడం జరిగినది.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయదుర్గం ప్రభుత్వ పాఠశాల మరియు జూనియర్ కళశాల లో మౌళికవసతులు కల్పిస్తామని , అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటామని, త్వరలోనే డిగ్రీ కాలేజ్ ప్రారంభించుకుంటాని , ఖానమెట్ లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు స్థలం కేటాయించడం జరిగినది అని , త్వరలోనే పనులు ప్రారంభించి,త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో కి తీసుకువస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో రాయదుర్గం విద్యా కమిటీ సభ్యులు కృష్ణ గౌడ్, నరేందర్ ముదిరాజ్, సురేష్, ప్రభాకర్,సుదర్శన్ మరియు తదితరులు పాల్గొన్నారు