కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ మాఫీ పై చేసేది చారెడంత… చెప్పేది బారెడంత…ఎమ్మెల్యే వివేకానంద్‌

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి బిఆర్‌ఎస్‌ భవన్‌ లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ మాఫీ పై చేసేది చారెడంత… చెప్పేది బారెడంత…బిఆర్‌ఎస్‌ భవన్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద్‌ , పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రైతు రుణమాఫీ పై ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ మాట్లాడుతూ….. ప్రభుత్వం నిన్న సంబరాల పేరుతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని అసలు ప్రభుత్వం సంబురాలు ఎందుకు చేసుకుంటుందో ప్రజలకు చెప్పాలి అని ఆరోపించారు.డిసెంబర్‌ 9 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుకా నిబంధనల పేరుతో అందరికీ రుణమాఫీ కాకుండా కొందరికే రుణమాఫీ చేస్తూ మాట నిలబెట్టుకోనందుకా అని అన్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసేది చారెడంత…? చెప్పేది బారెడంత…? అని ఏద్దేవ చేశారు.ఎన్నికలకు ముందు ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు అనేక రకాల రూల్స్‌ పెట్టారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking