తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

వ్యవసాయ కార్మిక సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి .దుర్గం నూతన్ కుమార్,జిల్లా అధ్యక్షులు డాకుర్ తిరుపతి,జిల్లా కమిటీ సభ్యులు చందుల సాయికిరణ్. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి .నాగేల్లి నర్సయ్య. లు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి చట్టం అమలు అనే అంశంపై హైదరాబాదు లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూన్ 10 నాడు జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి .ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా. గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీమతి సీతక్క హాజరవుతున్నారు.అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ గారు,ఎంపీ రాజ్యసభ సభ్యులు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సహాయ కార్యదర్శి శివ దాసన్ గారు హాజరవుతున్నారు .వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య ,ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు గారు* ఈ సదస్కు ముఖ్య వక్తలుగా హాజరుకానున్నారు. వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలు హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం .కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల గ్రామీణ ఉపాధి కార్మికులకు మరియు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నాం .వ్యవసాయ రంగ నిపుణులు , ఆర్థికవేత్తలు మేధావులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు పాల్గొన్నారు.కూలీల హక్కులను అరించిన బిజెపి పాలకులు కూలి రూపాయలు 28 పెంచి కూలి రేటు 300 రూపాయలు చేశారు .పెంచింది మోరేడు ,మోపింది బారేడు .ప్రభుత్వం కూలీలపై పనిభారం కొలతలను రెండింతలు పెంచింది .ఎనిమిది గంటలు పని చేయాలి .రెండు పూటలు ఫోటోలు అప్లోడ్ చేస్తేనే వేతనాలు, కేటాయించిన కొలతలను పూర్తి చేస్తేనే రూపాయలు 300 వేతనం .ఇంత కఠినమైన నిబంధనలతో పని చేయిస్తూ కూలీల శ్రమ దోపిడీకి ప్రభుత్వం పూనుకుంటున్నది .మండుటెండలో చేతులు బొబ్బలు వస్తున్న పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్న కూలీలకు ఫలితం దక్కడం లేదు. పైగా డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తామని కేంద్రం చెబుతోంది. కనీస వేతనాలు అమలు చేయని పాలక ప్రభుత్వాలకు కష్టజీవులను దొంగల్లో చూసే అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించాలని శ్రమించి పనిచేస్తూ సంపదకు మూలమైన మనమందరం ఏకమై గుంతెత్తి నినదించాలి.మన హక్కులను సాధించుకోవాలి. కొలతలను రద్దు చేయాలి .ఆరు గంటల పని ,రోజు రూపాయల 600 వేతనము,200 రోజులు పని దినాలు ఇవ్వాలి .వారం వారం వేతనాలు చెల్లించాలి. పని కల్పించని సందర్భంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి.మెడికల్ కిడ్స్ పిల్లల సంరక్షణకు ఆయాను నియమించాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking