విలాసాగర్ గ్రామపంచాయతీ ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మే 30

జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయం తో పాటు గ్రామపంచాయతీ చేసిన అభివృద్ధి పనులను జిల్లా పంచాయతీ అధికారి ఏ రవీందర్ గురువారం సందర్శించారు. గురువారం స్థానిక ఎంపీవో సతీష్ కుమార్ విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి తో కలిసి గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం,కంపోస్టు షెడ్,వైకుంఠ ధామం,నర్సరీ, క్రీడా ప్రాంగణాల ను జిల్లా పంచాయతీ అధికారి తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పనులను పంచాయతీ అధికారి పరిశీలించి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఎంపీవో సతీష్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking