విజన్ ఉన్న నాయకుడు శ్రీధర్ బాబు

– ఘనంగా మంత్రి దుద్దిళ్ల జన్మదిన వేడుకలు
– నాగరాజు ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ, రక్తదానం

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మే 30

ఎన్ఎస్ యూఐ కరీంనగర్ జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ ఆశ్రమంలో  కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలందరికి స్వీట్స్, పండ్లు పంపిణీ, రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ శ్రీధర్ బాబు రాజకీయాల్లో ముందు చూపు కలిగిన ఒక గొప్ప నాయకుడన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపన పడుతూ ప్రజా సేవే లక్ష్యంగాతన తండ్రి శ్రీపాదరావు పని చేశారని, తండ్రి వారసత్వాన్ని శ్రీధర్ బాబు కొనసాగిస్తున్నారనీ చెప్పారు.అజాత శత్రువు, మంథని ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు మాజీ స్పీకర్, స్వర్గీయ  శ్రీపాద రావు ఆశయ సాధనే లక్ష్యంగా శ్రీధర్ బాబు సేవలందిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చెర్మన్ దేశిని స్వప్న కోటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు సారంగపని, ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు,ఎర్రం సతీష్ రెడ్డి, బొంగోని వీరన్న, ముద్దమళ్ల రవి, ఎండీ సలీం, సజ్జద్,  సుదీర్, పాతకాల అనిల్, మాధవ్ రావు,సల్మాన్, రమేష్, ఫర్వేజ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking