హనుమాన్ మాల వేసుకున్న భక్తుల కోసం షవర్లు ఏర్పాటు
హనుమాన్ భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా హనుమాన్ జయంతికి ఏర్పాట్లు పూర్తి
ఇల్లందకుంట దేవస్థానం ఆలయ కార్య నిర్వహణ అధికారి కే సుధాకర్
ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి మే 30
జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఇల్లందకుంట దేవస్థానానికి భక్తులు అధికంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి కందుల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో సుధాకర్ మాట్లాడుతూ అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట దేవస్థానానికి హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి హనుమాన్ మాలను స్వీకరించిన భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా వారి యొక్క మొక్కులు చెల్లించుకొని మాల విరమణ చేయడం జరుగుతుందని వారికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా కోనేరు దగ్గర స్నానాల కోసం షవర్లను, నీటి కుళాయిలను ఏర్పాటు చేసినట్లు ఎండలు భారీ ఎత్తున కొడుతున్న తరుణంలో భక్తులకు తాగడానికి నీటి వసతి కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని ఆలయ కార్య నిర్వహణ అధికారి తెలిపారు.