కుంగ్-పూ నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది

 

మాస్టర్ రాజమల్లు

అలరించిన బెల్ట్ పోటీలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 09 : కుంగ్-పూ నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతో పాటు,ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డ్రాగన్ స్వార్డ్ కుంగ్ పూ అకాడమి పౌండర్ రాజమల్లు పేర్కొన్నారు.గురువారం పట్టణంలోని గురునానక్ గార్డెన్స్ లో డ్రాగన్ స్వార్డ్ కుంగ్-పూ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు,ఆత్మరక్షణ కోసం ప్రతిఒక్కరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు.120 మంది విద్యార్థులకు బెల్టులకు ప్రధానం చేశారు.ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో డ్రాగన్ స్వార్డ్ కుంగ్-పూ అకాడమీ ఫౌండర్ రాజమల్లు,ప్రెసిడెంట్ రాజేందర్, వైస్ ప్రెసిడెంట్ మహేష్,జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్,ఆర్గనైజర్ చంద్రయ్య,సీనియర్ మాస్టర్లు
ముజాయిద్,కొమురయ్య,
విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking