న్యాయవాద సమస్యలు పరిష్కరిస్తా

 

త్వరలో న్యాయవాద రక్షణ చట్టం

అతి త్వరలోనే నూతన లీగల్ సెల్ కమిటీ నియామకం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 02 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద సమస్యలే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కృషి చేస్తుందని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న న్యాయవాదుల చిరకాల ఆకాంక్ష న్యాయవాద రక్షణ చట్టం త్వరలో ఆమోదం పొందుతుందని, ప్రభుత్వం ద్వారా నియామకం కానున్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివిధ పోస్టులను స్థానిక మంత్రుల సహకారంతో త్వరలోనే భర్తీ చేస్తామని, న్యాయవాదులకు ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ రెండు లక్షల నుండి 5 లక్షల వరకు పెంచేందుకు కృషి చేస్తానని, ప్రస్తుతం తెలంగాణ బార్ కౌన్సిల్ ఇస్తున్న డెత్ బెన్ఫిట్ నాలుగు లక్షల నుండి 10 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తామని, 41 సి ఆర్ పి సి సవరణలు తీసుకువచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని, అర్హులైన న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని, యువ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు గత ఆరు నెలల క్రితమే ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ లీగల్ సెల్ కమిటీ రద్దయిందని త్వరలోనే భారీ ఎత్తున న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి కొత్త కమిటీని ప్రకటిస్తామన్నారు. న్యాయవాద సమస్యలే ప్రధాన ఎజెండాగా పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్ సింగం జనార్ధన్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మలీదు నాగేశ్వరరావు రావూరి నరసింహారావు సీనియర్ న్యాయవాది బత్తుల బసవ పున్నయ్య, మాజీ బార్ అసోసియేషన్ సెక్రెటరీ మన్నెపల్లి బసవయ్య, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కండే వెంకటేశ్వర్లు ట్రెజరర్ ఇజ్జగాని శ్రీనివాసరావు, లైబ్రరీ కార్యదర్శి గోపి , సీనియర్ న్యాయవాది గోవిందరావు ఆవుల అనురాధ వెంకట్ నారాయణ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డోన్వాత్ వెంకీయ నాయక్, మోజెస్ క్రిస్టఫర్, పంబ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking