పకడ్భందీగా శాసనసభ ఎన్నికలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి ప్రజాబలం 18 అక్టోబర్:
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో అన్ని రకాలుగా అవసరమైన పకడ్భందీ ఏర్పాట్లు చేసినట్లు ఈ విషయంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్దమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కీసరలోని బోగారం హోలీమేరి ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్రూమ్, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, డీసీపీ జానకీ, ఐదు నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఐదు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ గదులను స్వయంగా వెళ్ళి కలియదిరిగి అందులో ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే వివరాలను స్వయంగా తెలుసుకొన్నారు. అనంతరం ఆయా గదుల్లో అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి కళాశాలలో అవసరమైన చోట సీసీ కెమెరాలు, బ్యారీకేడ్లు, పార్కింగ్ వసతులు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. డిస్ట్రిబ్యూషన్ నుంచి మొదలుకొని ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్రూమ్, ఎన్నికలు ముగిసిన తర్వాత రిసెప్షన్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై గౌతమ్ అధికారులకు తెలియజెప్పారు. అలాగే ఎన్నికల సమయంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ విషయంలో ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే కళాశాలలో చేసే ఏర్పాట్లపై అధికారు లు వివరాలను చూయించగా… అందుకు సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు చేసి పూర్తి స్థాయిలో ప్లాన్ను తయారు చేయాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని… ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చూడాల్సిందిగా తెలిపారు. దీనిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే ఎన్నికలకు సంబంధించి సిబ్బందిని పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని… సిబ్బందికి ఏమాత్రం కొరత లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, డీసీపీ జానకీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking