మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా జరిగే ఎన్నికల్లో
టి పి టి ఎఫ్ బలపరిచిన ప్రొఫెసర్ వినయ్ బాబు గారికి మద్దతుగా ఈ రోజు తూప్రాన్ మండలములో గల ఉన్నత పాఠశాలలను టి పి టి ఎఫ్ మెదక్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి అధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమలో రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండల్ రెడ్డి మాట్లాడుతూ మేధావుల సభకు మేదావినే గెలిపించాలని, విద్యా రంగంలో సుదీర్ఘ కాలంగా పని చేసిన అనుభవం ఉందని , సమస్యల పట్ల చక్కటి అవగాహన ఉందని,నేటి విద్యా వ్యవస్థలో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి అని అన్నారు. ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం కోసం
టి పి టి ఎఫ్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న విషయం,ఆ పోరాటాలను చట్ట సభల్లో ప్రస్తావించాలి,ఆ దిశగా వినయ్ బాబు గారు కృషి చేస్తారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ రాజేంద్ర ప్రసాద్, మండల కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.