అవినీతి బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దెదించుదాం.

 

విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పని చేసి విజయం సాధిద్దాం.
పార్లమెంటరీ ఇంచార్జ్,ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్.

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ఇంచార్జ్, ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ అన్నారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలంగాణ కోసం యువకుల బలిదానాలు చేసుకోవద్దని ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఇచ్చినప్పటికి రెండు సార్లు అధికారంలోకి రాలేక పోయామని అన్నారు.నీళ్లు, నిధులు,నియామకాల పేరుతో ప్రజలను మోసం చేసి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి కుటుంబ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో అవినీతి బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దె దించాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కలిసికట్టుగా కష్టపడి పనిచేసి అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు.తెలంగాణలో ఎన్నికలకు మరో వంద రోజుల సమయం ఉందని,ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని కోరారు. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి చరిత్ర సృష్టించాలని అన్నారు.ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఎక్కువ ఉన్నారని టికెట్ మాత్రం ఒక్కరికి వచ్చే అవకాశం ఉందని, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన కష్టపడి పని చేయాలని అన్నారు. టికెట్టు రాలేదని పార్టీలు మారవద్దని కోరారు. విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా కృషి చేస్తే అధికారంలోకి తప్పనిసరిగా వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాల మేనిఫెస్టోను వివరించాలని అన్నారు. మూడు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో బూతు స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. వంద రోజులు ప్రజల్లోనే ఉండి పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అధినేత రాహుల్ గాంధీ 3500 కిలోమీటర్ల భారత్ జూడో యాత్ర చేపట్టారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు,సాజిద్ ఖాన్,విశ్వ ప్రసాద్ రావు.మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్.తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking