ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం శుచి శుభ్రత పాటిద్దాం

 

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 02 అక్టోబర్ 2023: మణికొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోని సెక్రెట్రియట్ శ్రీరామ్ నగర్ కాలనీలోని గోల్డెన్ టెంపుల్ నుండి చారిత్రాత్మక స్వచ్ఛత హి సేవా ర్యాలీ నిర్వహించడం జరిగినది, అందులో భాగంగా ఆర్.కే స్క్వేర్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ 154 వ జయంతి సందర్భముగా వారికీ నివాళులు అర్పించి, మున్సిపల్ ఆఫీస్ వరకూ ర్యాలీ కొనసాగించి, అక్కడ మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల ఇరువురి జయంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పించి, మనం మన ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రతతోపాటు శుచి శుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్య వంతమైన సమ సమాజ నిర్మాణం చేపట్టడం అవుతుందని, అందుకొరకు అందరూ విధిగా చైతన్య వంతులై అపరి శుభ్రతపై రాజీలేని పోరాటం చేయాలని, ప్రజా ప్రయోజన స్వచ్ఛత ఉద్యమంలో భాగం పంచుకోవాలని, మణికొండ పురపాలక పరిధిలోని ప్రతి కాలనీ, వీధిలలో అంతటా స్వచ్ఛతను పాటించాలని స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ రాజేంద్ర నగర్ స్వచ్ఛ మణికొండ నిర్మాణంలో మనం అందరం పెద్ద పాత్ర పోషించాలని ప్రజలకు తెలియ పరుచాలని ప్రతిజ్ఞ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, కమిషనర్ ఫాల్గుణ కుమార్, వైస్ చైర్మన్ కే. నరేందర్ రెడ్డి, బీ.ఆర్.యస్ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణా రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాల్లు, యువ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking