రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 16 సెప్టెంబర్ 2023: విఘ్నాలను తొలగించే ఆది దేవుడైన వినాయక విగ్రహాలను ప్లాస్టర్ తో తయారు చేసిన వాటిని పూజించడం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని కావున ప్రతీ ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలని మణికొండ పురపాలక సంఘం వార్డ్ 8 కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్ పిలుపునిస్తు అందులో భాగంగా అలకాపురి రోడ్ నంబర్ 30లో గల జయశంకర్ పార్కులో పర్యావరణాన్ని పరి రక్షించే సదుద్దేశంతో స్థానిక కౌన్సిలర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఇకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను స్థానిక ప్రజలకు పూజకు వినియోగించడానికి పంపిణీ చేయడం జరిగినదనీ ఇట్టి ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను చెరువులలో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం నియంత్రించడమే కాకుండా చెరువులలో మట్టి శాతం పెరుగు తుందని ఈ సంధర్భంగా చెప్పడం జరిగింది. ఈ శుభ ఘడియలలో అలకాపురి నివాసులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.