అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు. ఓటరు నమోదు చేసుకోవాలి. ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఎలక్షన్ సెకండ్ సమ్మరీ రివిజన్ లో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీమ్ నిర్మల్ జిల్లా. పాలనాధికారి వరుణ్ రెడ్డి , మంచిర్యాల జిల్లా. పాలనాధికారి సంతోష్ , నిర్మల్ రెవెన్యు అధనపు కలెక్టర్ లు కిషోర్ కుమార్, మంచిర్యాల లోకల్ బాడి రాహుల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు కొత్త ఓటర్ నమోదు కొరకు ఇంకా మూడు రోజులే సమయం ఉన్నందున ఈఆర్వోలు దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగాలన్నారు. దాని కొరకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా సోషల్ మీడియాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని అన్నారు. గడువు సమీపిస్తున్నందున చివరి నిమిషంలో ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చి ఇబ్బంది ఏర్పడకుండా ఇప్పటినుండే మూడు రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి బి ఎల్ వో ల ద్వారా క్షేత్రస్థాయిలో పని సక్రమంగా జరిగేటట్టు చూడాలని అన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు పెళ్లిళ్లు అయి చిరునామా మారిన వారిని గుర్తించి వారికి కూడా కొత్త చిరునామాలో ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. చనిపోయిన వారిని వలస వెళ్లిన వారిని ఓటు హక్కు నుండి తొలగించే కార్యక్రమం పకడ్బందీగా జరగాలని అన్నారు కచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని అనర్హులు ఎవరైనా ఉంటే వారిని జాబితా నుండి తీసివేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు పై చైతన్యం కలిగించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని దానిలో భాగంగానే గత నెలలో ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి 5కే రన్ నిర్వహించడం జరిగిందని నాలుగు రోజుల పాటు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహించామని, అంతేకాకుండా చునావ్ గ్రామసభలో భాగంగా వివిధ గ్రామాలలో పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో హాజరైన వివిధ రాజకీయ పార్టీల నేతలు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు మంచిర్యాల కలెక్టర్ మరియు నిర్మల్ జిల్లా కలెక్టర్లు సమాధానం తో నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో. నిర్మల్, మంచిర్యాల. ఆర్డీవోలు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.