లక్షెట్టిపేట కేజీబీవీలో నాణ్యమైన విద్య
కే జీ బీ వీ స్పెషల్ ఆఫీసర్ కవిత
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 18 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట కస్తూరిభా గాంధీ విద్యాలయంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కవిత గురువారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిమిత సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.వంద శాతం ఉత్తీర్ణతతో విద్యా బోదన చేస్తున్నట్లు తెలిపారు.గత సంవత్సరం సీనియర్ ఇంటర్ లో 976,సంకీర్తన 976,జూనియర్ ఇంటర్ లో పూజిత 441,రోషిణి 433 మార్కులు సాధించారన్నారు.6వ తరగతిలో, ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీలో ఖాళీలున్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు అప్లై చేసుకోవాలన్నారు.పూర్తి వివరాలకు 9704356395 నంబర్ ను సంప్రదించలన్నారు.