ఉద్యమ కారుడికి గుర్తింపు

ప్రజా సమస్యల పరిస్కారకై కృషి చేస్తా

పీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గడ్డం వెంకటేష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 18 : ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేస్తానని పీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గడ్డం వెంకటేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆయనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ డిపార్ట్మెంట్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా గడ్డం వెంకటేష్ ను నియమిస్తూ రాష్ట్ర కన్వీనర్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమకారున్ని గుర్తించి పదివి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నీళ్లు,నిధులు,నియామకాలు, ఆత్మగౌరవం,తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమని విద్యార్థి దశలోని నమ్మి తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొని రైలు రోకో,రాస్తారోకో, వంటావార్పు,ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగినటువంటి మహా ఉద్యమంలో ప్రతిరోజు నా వంతుగా పాత్ర నిర్వహిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లానన్నారు.తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకి వెళ్లానన్నారు.తెలంగాణ రాష్ట్ర జాయింట్ కన్వీనర్,ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్,హ్యూమన్ రైట్స్,ఆర్ టీ ఐ డిపార్ట్మెంట్, పదవీ బాధ్యతలు అప్పజెప్పిన, రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, దీపా దాస్ మున్షి,హార్దిక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking