తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సింహ గర్జన

 

హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రొఫెసర్ కోదండరాం

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 1 (ప్రజాబలం) ఖమ్మం
తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో యువజన సింహ గర్జన జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ మద్దిశెట్టి అజయ్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు సభను ఉద్దేశించి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జీవితాలు మారుతాయని కలలు కన్న యువత కు కేసీఅర్ అన్యాయం చేశారు టీ.ఎస్.పీ.ఎస్సీ వైఫల్యం అవినీతి ప్రభుత్వం వల్ల ప్రవళిక ఆత్మహత్య యువత భవిష్యత్తు నాశనం చేస్తూ ఊరూరా బెల్ట్ షాప్ లు పెట్టీ మద్యం కు బానిసలుగా మార్చారు అవినీతి అరాచక నియంత కేసీఅర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి కాంగ్రెస్ పార్టీ గెలుపుతో నే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యం
అన్నారు నాకు మద్దతు ప్రకటించిన ప్రొఫెసర్ కోదండరాం కృతజ్ఞతలు తెలంగాణ ఉద్యమానికి రథ సారధి గా కోదండరాం చరిత్రలో నిలిచారు

ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు నాగ చారి జిల్లా అధ్యక్షులు గుండా నరేష్ ప్రజలు బంధువులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking