మరోసారి మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్ కుమార్

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 1 (ప్రజాబలం) ఖమ్మం నగరం స్థానిక చెరువు బజారులో నివసిస్తున్న బాణోత్ నాగేశ్వరావు,ఎస్ డి జితన్ లు అయిన నిరుపేద దంపతులకు జన్మించిన బేబీ తేజస్విని (5 సంవత్సరాలు) నెఫ్రోటిక్ సిన్ డ్రోమ్ అనే అరుదైన వ్యాధితో జీవనరేఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది ఈ వ్యాధి బారిన పడిన వారికి శరీరంలో ఉన్న విటమిన్స్ మరియు ప్రోటీన్స్ మూత్రం ద్వారా బయటికి వచ్చేయబడుతుంది తద్వారా శరీరంలో నీరు చేరి, ఉబ్బి పోయి, అనేక సమస్యలకు దారి తీస్తుంది.ఈ అరుదైన వ్యాధిని కంట్రోల్ చెయ్యాలంటే చాలా ఖరీదైన వైద్యం అవసరం. చిన్నారి తల్లితండ్రుల పేదరికం కారణంతో దాత అయిన పల్లా కిరణ్ ను సంప్రదించగా, పల్లా కిరణ్ వెంటనే స్పందించి వారి తండ్రి పల్లా జాన్ రాములు 85వ జయంతి సందర్భంగా చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక చేయూత అందించి మరోసారి మానవత్వం చాటుకున్నారుఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులకు పల్లా కిరణ్ ధైర్యం చెప్పి, అండగా ఉంటన్నాని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking