లిటిల్ స్టార్ పాఠశాలను గోరింటాకు సంబరాలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 24 : మంచిర్యాలలోని లక్షెట్టిపేట పట్టణంలోని లిటిల్ స్టార్ గ్రామర్ స్కూలు లో ఆషాడ మాసం గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ…ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది.ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు.ఇక పొలం పనులు చేసుకునేవారు,ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్లూ,చేతులను తడపకుండా రోజుని దాటలేరు.అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం,గోళ్లు దెబ్బతినడం సహజం.గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది.ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు.పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.
ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి.గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది.అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండ
ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు.గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది.కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు.వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి. అంటూ విద్యార్థులకు గోరింటాకు విశిష్టతను వివరించారు.అనంతరం విద్యార్థులు తెచ్చిన గోరింటాకు తమ తోటి విద్యార్థులకు పెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మినుముల శ్రీనివాస్,మహమ్మద్ హమీద్,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking