మిస్సింగ్ కేసులు త్వరితగతిన ఛాలంజ్ గా తీసుకోని డిటెక్ట్ చేయాలి

 

శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వనికి అవకాశం ఇవ్వొద్దు

ఇన్వెస్టగేషన్ పూర్తి ఆధారాలతో పారదర్శకతతో చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలి

పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 24 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోనీ డీసీపీ,ఏసీపీ లు,సీఐ,పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ అధికారులతో కమీషనరెట్ లో యుఐ కేసులు,గ్రేవ్ యుఐ లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం,ఎస్ సి/ఎస్ టీ యుఐ కేసులు,ఉమెన్ ఎగైనెస్ట్ కేసులు,పిడిపిఎస్ కేసుల పరిష్కారం,ఎన్ డి పి ఎస్ యాక్ట్ కేసుల,ఎన్ ఎచ్ ఆర్ సీ, ఎస్ ఎచ్ ఆర్ సీ,మహిళా కమిషన్‌కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై రామగుండము పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ సమీక్షా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో,ఎస్సీ,ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు.ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.ప్రతి సిడి ఫైల్ ను,అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని,పెండింగ్ ఉన్న సిసి నెంబర్లు తీసుకోవాలన్నారు.ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ పొందుపరచాలని,నేర చేదన కంటే,నేర నివారణ చాలా ముఖ్యమని తెలిపారు.శాంతిభద్రతల సంరక్షణలో అలసత్వానికి తావివ్వొద్దని,పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి చట్ట పరిధిలో వెంటనే కేసులు నమోదు చేసి వెంటనే సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సీపీ అధికారులకు సూచించారు.ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. విచారణ వెంటనే పూర్తి చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖాలు చేయాలనీ విచారణలో ‘పారదర్శకత పాటించాలన్నారు.ఎస్సీ, ఎస్టీ,మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతికన పరిష్కరించాలి.నేరాల నియంత్రణకు విసబుల్ పోలీసింగ్,నిరంతర పెట్రోలింగ్ తో పాటు సాంకేతిక వ్యవస్థ కూడా ఉపయోగించుకోవాలి అన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్స్ డ్రైవ్స్ కూడా నిర్వహించాలి. పెట్రోలింగ్ వాహనాలతో సిబ్బంది నేరం జరిగిన వెంటనే స్పందించాలని సూచించారు.నేర చరిత్ర ఉన్న కేడిలు,బీసీలు,సస్పెక్ట్ షీట్లు ఇళ్లను తనిఖీ చేయాలని,పోలీస్ స్టేషన్ లలో ఫంక్షనల్ వర్టికల్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు.ప్రతి వారం కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు.ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.రోడ్డు ప్రమాదాల ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.భూ,సివిల్ కేసుల్లో ఎస్ఓపి ప్రకారం పాందర్శకంగా విచారణ చేపట్టాలన్నారు.గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి.పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై నజరు పెట్టాలని, ముఖ్యంగా గంజాయితో పాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్మకాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ క్రింద నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.ఈ సమావేశం లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు,గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు,పెద్దపల్లి జోన్ సీఐలు,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామచందర్ రావు,సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు,ఎస్సై లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking